Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Monday, September 30, 2013

రూతు 3వ అధ్యాయము

Rth 3:1  ఆమె అత్తయైన నయోమినా కుమారీ, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. 
Rth 3:2  ఎవని పనికత్తెలయొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో యీ రాత్రి అతడు కళ్లమున యవలు తూర్పారబట్టింప బోవుచున్నాడు. 
Rth 3:3  నీవు స్నానముచేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్లమునకు వెళ్లుము; అతడు అన్నపానములు పుచ్చు కొనుట చాలించువరకు నీవు అతనికి మరుగైయుండుము. 
Rth 3:4  అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్లమీద నున్న బట్ట తీసి పండుకొనవలెను; నీవు చేయవలసినదానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా 
Rth 3:5  ఆమెనీవు సెలవిచ్చినదంతయు చేసెదనని చెప్పి 
Rth 3:6  ఆ కళ్లమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించిన దంతయు చేసెను. 
Rth 3:7  బోయజు మనస్సున సంతోషించునట్లు అన్న పానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్లమీదనున్న బట్ట తీసి పండుకొనెను. 
Rth 3:8  మధ్యరాత్రియందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు, ఒక స్త్రీ అతని కాళ్లయొద్ద పండుకొని యుండెను. 
Rth 3:9  అతడునీ వెవరవని అడుగగా ఆమెనేను రూతు అను నీ దాసురాలిని; నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలిమీద నీ కొంగు కప్పు మనగా 
Rth 3:10  అతడునా కుమారీ, యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు; కొద్దివారినే గాని గొప్పవారినే గాని యౌవనస్థులను నీవు వెంబడింపక యుండుటవలన నీ మునుపటి సత్‌ ప్రవర్తనకంటె వెనుకటి సత్‌ ప్రవర్తన మరి ఎక్కువైనది. 
Rth 3:11  కాబట్టి నా కుమారీ, భయపడకుము; నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యు రాలవని నా జనులందరు ఎరుగుదురు. 
Rth 3:12  నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే; అయితే నీకు నాకంటె సమీపమైన బంధువు డొకడున్నాడు. 
Rth 3:13  ఈరాత్రి యుండుము; ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపినయెడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేక పోయినయెడల, యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను; ఉదయమువరకు పండుకొను మని చెప్పెను. 
Rth 3:14  కాబట్టి ఆమె ఉదయమువరకు అతని కాళ్లయొద్ద పండుకొని, ఒకని నొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడుఆ స్త్రీ కళ్లమునకు వచ్చిన సంగతి తెలియ జేయకుడని చెప్పెను. 
Rth 3:15  మరియు అతడునీవు వేసి కొనిన దుప్పటి తెచ్చి పట్టు కొనుమని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు ఆరుకొలల యవలను కొలచి ఆమె భుజముమీద నుంచగా ఆమె పురములోనికి వెళ్లెను. 
Rth 3:16  ఆమె తన అత్త యింటికి వచ్చినప్పుడు అత్తనా కుమారీ, నీ పని యెట్లు జరిగెనని యడుగగా, ఆమె ఆ మనుష్యుడు తనకు చేసిన దంతయు తెలియజేసి 
Rth 3:17  నీవు వట్టిచేతులతో నీ అత్త యింటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల యవలను నాకిచ్చె ననెను. 
Rth 3:18  అప్పుడు ఆమెనా కుమారీ, యీ సంగతి నేటిదినమున నెరవేర్చితేనే కాని ఆ మనుష్యుడు ఊర కుండడు గనుక యిది ఏలాగు జరుగునో నీకు తెలియు వరకు ఊరకుండుమనెను. 

No comments:

Post a Comment