Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Monday, September 30, 2013

రూతు 2వ అధ్యాయము

Rth 2:1  నయోమి పెనిమిటికి బంధువు డొకడుండెను. అతడు చాల ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపువాడై యుండెను, అతని పేరు బోయజు. 
Rth 2:2  మోయాబీయురాలైన రూతునీ సెలవైనయెడల నేను పొలములోనికి పోయి, యెవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమెనా కూమారీ పొమ్మనెను. 
Rth 2:3  కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుది. 
Rth 2:4  బోయజు బేత్లెహేమునుండి వచ్చియెహోవా మీకు తోడై యుండునుగాకని చేను కోయువారితో చెప్పగా వారుయెహోవా నిన్ను ఆశీర్వ దించును గాకనిరి. 
Rth 2:5  అప్పుడు బోయజు కోయువారిమీద ఉంచబడిన తన పనివానిని చూచిఈ చిన్నది ఎవరిదని అడుగగా 
Rth 2:6  కోయువారిమీద నుంచబడిన ఆ పనివాడుఈమె మోయాబుదేశమునుండి నయోమితో కూడ తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యౌవనురాలు. 
Rth 2:7  ఆమెనేను కోయువారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని యిదివరకు ఏరుకొను చుండెను, కొంతసేపు మాత్రము ఆమె యింట కూర్చుండెనని వాడు చెప్పెను. 
Rth 2:8  అప్పుడు బోయజు రూతుతోనా కుమారీ, నా మాట వినుము; వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెలయొద్ద నిలకడగా ఉండుము. 
Rth 2:9  వారు కోయుచేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యౌవనస్థులకు ఆజ్ఞాపించియున్నాను, నీకు దాహ మగునప్పుడు కుండలయొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. 
Rth 2:10  అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొనిఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్య ముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయజునీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. 
Rth 2:11  నీవు నీ తలి దండ్రులను నీ జన్మభూమిని విడిచి, యింతకుముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి. 
Rth 2:12  యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తర మిచ్చెను. 
Rth 2:13  అందుకు ఆమెనా యేలిన వాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను, నీవు నన్నాదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమగలిగి మాటలాడితివి గనుక నాయెడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను. 
Rth 2:14  బోయజుభోజనకాలమున నీ విక్కడికి వచ్చిభోజనముచేసి, చిరకలో నీ ముక్క ముంచి, తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయు వారియొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియ్యగా ఆమె తిని తృప్తిపొంది కొన్ని మిగిల్చెను. 
Rth 2:15  ఆమె యేరు కొనుటకు లేచినప్పుడు బోయజుఆమె పనలమధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి 
Rth 2:16  మరియు ఆమెకొరకు పిడికెళ్లు పడవేసి ఆమె యేరుకొనునట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసుల కాజ్ఞా పించెను. 
Rth 2:17  కాబట్టి ఆమె అస్తమయమువరకు ఆ చేనిలో ఏరుకొనుచు, తాను ఏరుకొనిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయెను. 
Rth 2:18  ఆమె వాటిని ఎత్తికొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె యేరు కొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తిపొందిన తరువాత తాను మిగిల్చినదానిని చూపించి ఆమెకిచ్చెను. 
Rth 2:19  అంతట ఆమె అత్త ఆమెతో­నేడు నీవెక్కడ ఏరు కొంటివి? ఎక్కడ పనిచేసితివి? నీయందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పిఎవని యుద్ద నేడు పనిచేసితినో అతనిపేరు బోయజు అనెను. 
Rth 2:20  నయోమిబ్రదికియున్న వారికిని చచ్చినవారికిని ఉప కారము చేయుట మానని యితడు యెహోవాచేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమిఆ మనుష్యుడు మనకు సమీపబంధు వుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా 
Rth 2:21  మోయాబీయురాలైన రూతు అంతేకాదు, అతడు నన్ను చూచి, తనకు కలిగిన పంటకోత అంతయు ముగించువరకు తన పని వారియొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెననెను. 
Rth 2:22  అప్పుడు నయోమి తన కోడలైన రూతుతోనా కుమారీ, అతని పనికత్తెలతో కూడనే బయలుదేరుచు వేరొక చేనిలోనివారికి నీవు కనబడక పోవుట మంచిదనెను. 
Rth 2:23  కాబట్టి యవలకోతయు గోధు మలకోతయు ముగియువరకు ఆమె యేరుకొనుచు బోయజు పనికత్తెలయొద్ద నిలకడగానుండి తన అత్త యింట నివ సించెను. 

No comments:

Post a Comment